: హావ్ లాక్ దీవి నుంచి 425 మంది బయటకు... పెను తుపాను ధాటికి ఇంకా అక్కడే వందలాది మంది


తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందిన 'వార్దా' ధాటికి సహాయక చర్యలు మందకొడిగా సాగుతూ ఉండటంతో అండమాన్ నికోబార్ దీవుల్లో చిక్కుకున్న వేలాది మంది టూరిస్టులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీల్, హావ్ లాక్ ద్వీపాల్లో చిక్కుకున్న వారి నుంచి భారత నావికాదళం 425 మందిని రక్షించింది. మరో 295 మందిని భారత వాయుసేన కాపాడింది. ఇంతవరకూ ప్రాణనష్టం సంభవించలేదని, ఇంకా ఆ దీవుల్లోనే చిక్కుకున్న వందలాది మందిని రక్షించాల్సి వుందని అధికారులు తెలిపారు. తుపాను కారణంగా సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయని, నేటి రాత్రికి అందరినీ పోర్టు బ్లెయిర్ కు చేరుస్తామని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ లో నాలుగు వాయుసేన విమానాలు, మూడు హెలికాప్టర్లు, ఆరు నావీ షిప్ లు పాల్గొంటున్నాయి. కాగా, దాదాపు 1400 మంది టూరిస్టులు హావ్ లాక్, నీల్ దీవుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పోర్టు బ్లెయిర్ కు 40 కిలోమీటర్ల దూరంలోని ఈ దీవులు అండమాన్, నికోబార్ ద్వీప సముదాయంలోనే అత్యంత ఆకర్షణీయమైనవి.

  • Loading...

More Telugu News