: ఆ రోజు ఏం జరిగింది? ‘నవంబరు 8’పై వెలుగులోకి ఆసక్తికర అంశాలు


నవంబరు 8.. ఈ రోజును భారతావని ఇప్పట్లో మరిచిపోదు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర ఇబ్బందులకు కారణమైన 8వ తేదీని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు ముందు ఆ రాత్రి ఎటువంటి కసరత్తు జరిగిందన్న ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మోదీకి అత్యంత నమ్మకస్తుడైన ఉన్నతాధికారి సహా మరో ఐదుగురు సభ్యుల బృందం మోదీ నివాసంలో నోట్ల రద్దుపై పూర్తిస్థాయిలో చర్చించింది. వీరికి సమాచార, ఆర్థిక అంశాల విశ్లేషణలో నిపుణులైన కొందరు సహకరించారు. మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడైన రెవెన్యూ కార్యదర్శి హస్‌ముక్ అదియా నాయకత్వంలో ప్రధాని నివాసంలో రెండు గదుల్లో నోట్ల రద్దుపై మూడో కంటికి తెలియకుండా పూర్తిస్థాయిలో కసరత్తు జరిగింది. నోట్ల రద్దు ప్రకటనకు ముందు నిర్వహించిన మంత్రుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు అంశంపై తాను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశానని, ఇది కనుక విఫలమైతే అందుకు పూర్తి బాధ్యత తానే వహిస్తానని చెప్పారట.

  • Loading...

More Telugu News