: గోల్కొండ ఎస్‌ఐపై చర్యలు తీసుకోండి.. పోలీసులకు కార్వాన్ ఎమ్మెల్యే ఫిర్యాదు
హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కోటేశ్వర్ నిన్న అర్ధరాత్రి మోతి దర్వాజలోని ఓ హోటల్ యజమానిపై దాడి చేశాడంటూ పోలీస్‌స్టేషన్‌లో కార్వాన్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సదరు హోటల్ యజమాని అర్ధరాత్రి హోటల్‌ను తెరిచాడంటూ ఎస్‌ఐ దాడి చేశారని, దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి ప్రస్తుతం గోల్కొండ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని, అయితే, అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆ ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. సదరు ఎస్‌ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.