: అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో మాజీ ఎయిర్ చీఫ్ త్యాగి అరెస్టు


అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసులో మాజీ ఎయిర్ చీఫ్ ఎస్.పి. త్యాగి సహా ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. త్యాగితో పాటు గౌతమ్ ఖైతాన్, సంజీవ్ త్యాగి లను అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో త్యాగికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు ఆరోపణలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News