: పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు? నిర్ణయాన్ని సీక్రెట్ గా ఉంచారా?: కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు


పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేయాలనుకున్నారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారా? అని అడిగింది. అంతేకాదు, వారానికి రూ. 24 వేల రూపాయలను మాత్రమే విత్ డ్రా చేయాలనే పరిమితిని ఎందుకు విధించారని ప్రశ్నించింది. నగదు రద్దుకు, విత్ డ్రా పరిమితికి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించింది. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ రోహత్గీ వాదించగా... పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఈ సందర్భంగా నగదు లభ్యత విషయంలో ఏర్పడ్డ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టిందని రోహత్గీ కోర్టుకు తెలిపారు. నగదు లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని... ఏటీఎంలలో సాఫ్ట్ వేర్ మార్పును కూడా సరిగా చేయలేకపోయారని ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News