: నన్ను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు... వాట్ ఏ జోక్!: విజయ్ మాల్యా


తన ఈ మెయిల్ అకౌంట్లను హ్యాక్ చేసి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ట్విట్లర్లో తెలిపారు. ఈ ఉదయం తన అకౌంట్స్ ను హ్యాక్ చేశారని... తన పేరు మీద కొన్ని ట్వీట్స్ కూడా చేశారని తెలిపారు. 'నన్ను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు... వాట్ ఏ జోక్' అని ట్వీట్ చేశారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న మాల్యా సంపద, పాస్ వర్డ్ వివరాలతో మళ్లీ వస్తామని హ్యాకర్లు ట్వీట్ చేశారు. అంతేకాదు, తాము చేస్తున్న పనికి అందరూ మద్దతు ఇవ్వాలని హ్యాకర్లు కోరారు. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News