: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...రాహుల్ బౌల్డ్


ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే దెబ్బతగిలింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ ను మొయిన్ అలీ అనూహ్యమైన బంతితో బౌల్డ్ చేశాడు. 400 పరుగులకు ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ కావడంతో టీమిండియా ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు దిగారు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ తొలి స్పెల్ పేసర్లకు ఇచ్చి వెంటనే స్పిన్నర్లను రంగంలోకి దింపేశాడు. దీంతో కట్టుదిట్టమైన బంతులతో రషీద్, అలీ బ్యాట్స్ మన్ ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో రాహుల్ ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో ఏ దశలోనూ వీరు బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఇంతలో అనూహ్యంగా టర్న్ అయిన బంతి బ్యాటు, కాళ్ల మధ్యలోని సందులోంచి దూసుకెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో 41 బంతుల్లో 24 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం డిపెండర్ ఛటేశ్వర్ పుజారా (3), మురళీ విజయ్ (17)కు జతగా బరిలోకి దిగాడు. దీంతో 16 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. మొయిన్ అలీ ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ కంటే టీమిండియా 359 పరుగులు వెనుకబడి ఉంది.

  • Loading...

More Telugu News