: ఇంగ్లాండ్ టెయిలెండర్ల పోరాటం!
ఇంగ్లండ్ టెయిలెండర్లు ఆకట్టుకుంటున్నారు. టాప్ ఆర్డర్ లో కేవలం జెన్నింగ్స్ ఒక్కడే రాణించిన వేళ టెయిలెండర్లు ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడుతున్నారు. 288/5 పరుగుల వద్ద తొలిరోజు ఇన్నింగ్స్ ముగించిన ఇంగ్లండ్ జట్టులో రెండో రోజు టెయిలెండర్లు పోరాటం చేస్తున్నారు. బంతి అనూహ్యమైన టర్న్ తీసుకుంటున్నప్పటికీ మొక్కవోని పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నారు. టాప్ ఆర్డర్ ఎదుర్కోలేకపోయిన బంతులను సమర్థవంతంగా ఎదుర్కొని ఇంగ్లండ్ స్కోరు బోర్డు మీద మరో వంద పరుగులు జతచేశారు. దీంతో బెన్ స్టోక్స్ (31), బెట్లర్ (64), బాల్ (31)లు ఆకట్టుకున్నారు. క్రీజులో ప్రస్తుతం బట్లర్, ఆండర్సన్ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లతో రాణించగా, అశ్విన్ 3 వికెట్లుతీసి చక్కని సహకారమందించాడు.