: సోనియాగాంధీకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు సోనియా 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ప్రముఖ నేతలంతా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "శ్రీమతి సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆమెకు ఆయురారోగ్యాలతో కూడిన నిండు జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలి", అంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు, సోనియా నివాసం ఎదుట జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి.

  • Loading...

More Telugu News