: ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట...బాబుపై విచారణ అవసరం లేదన్న హైకోర్టు
ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తుతో తాము ఏకీభవిస్తున్నామని హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబుపై విచారణ చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. కాగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును విచారించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలను తోసిపుచ్చింది.