: సీబీఐ ముందు లొంగిపోయిన పోస్టల్ ఉద్యోగి సుధీర్ బాబు
నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోస్టల్ ఉద్యోగి సుధీర్ బాబు సీబీఐ ఎదుట లొంగిపోయారు. హైదరాబాదులో సీనియర్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న సుధీర్ బాబు తపాలా శాఖ ఉద్యోగుల ద్వారా 2.95 కోట్ల రూపాయలు మార్చినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఆయన సుమారు 11 కోట్ల రూపాయలు మార్చినట్టు వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని హిమాయత్ నగర్, గోల్కొండ, కార్వాన్ లోని తపాలా శాఖ కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించి, స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు, పలు అభియోగాలు నమోదు చేసి, పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే. అవినీతికి పాల్పడి పరారీ కావడంతో తపాలా శాఖ ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన సీబీఐ అధికారుల ఎదుట నేడు లొంగిపోయారు. కాగా, అతనిపై 3 కేసులు నమోదు చేశారు.