: తాగి పడబోతోందని సాయం చేయబోతే.. హర్ట్ చేసిన బాలీవుడ్ నటి!


ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రవర్తన బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అర్బాజ్ ఖాన్ తో వివాహ బంధాన్ని తెంచుకున్న మలైకా అరోరా, తాజాగా ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా 50వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా పూటుగా మద్యం తాగిన మలైకా తూలి పడబోయింది. దీంతో పక్కనే ఉన్న బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆమెను పట్టుకోబోయింది. దాంతో ఆమె చేతిని విదిలించుకున్న మలైకా 'దూరంగా ఉండు...నేను మేనేజ్ చేసుకోగలను' అంటూ మండిపడిందంట. దీంతో ఖిన్నురాలైన సోనమ్ మౌనంగా ఉండిపోయిందట. దాంతో కరణ్ జొహర్, మనీష్ మల్హోత్రా కలసి ఆమెను లోపలికి తీసుకెళ్లారని సమాచారం. కాగా, మలైకా అరోరాతో అఫైర్ ఉన్న అర్జున్ కపూర్ కు సోనమ్ కజిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఇంట్లో పెద్దదైన సోనమ్ అంటే అనిల్ కపూర్, బోనీ కపూర్ కుటుంబంలో అందరికీ ఇష్టమన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సోనమ్ పై అరవడం ఆసక్తి రేపుతోంది.

  • Loading...

More Telugu News