: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను వినియోగించే వారికి ప్రోత్సాహాన్ని అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2000 లోపు లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ ను రద్దు చేసింది. అంతేకాదు, ఇతర చెల్లింపుల సేవల్లో కూడా మినహాయింపులు ఇవ్వనుంది. దీని కోసం జూన్ 2012 సర్వీస్ ట్యాక్స్ నోటిఫికేషన్ ను మార్చనుంది. కొత్త నోటిఫికేషన్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్బీఐ నిన్న కొత్త నిబంధన విధించింది. ఇకపై రూ. 2000ల వరకు చెల్లింపులకు వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) అవసరం లేదని... వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చాలని తెలిపింది.