: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం... నోట్ల రద్దుపై గందరగోళం... రాజ్యసభ వాయిదా
పార్లమెంటు ఉభయసభలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. వెంటనే, ఉభయసభల్లోను పెద్ద నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. లోక్ సభలో ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యసభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని కూడా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో, సభను సవ్యంగా నిర్వహించేందుకు సహకరించాలని ఛైర్మన్ హమీద్ అన్సారీ పదేపదే విన్నవించారు. అయినా విపక్ష సభ్యులు వినకపోవడంతో... మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు.