: అర్ధరాత్రి హాంకాంగ్ వెళ్లాల్సిన విమానం ఇంకా శంషాబాద్ లోనే ఆగిపోయింది
నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాంకాంగ్ వెళ్లాల్సిన క్యాథే పసిఫిక్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో, విమానాన్ని హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ ల్యాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, సీఎక్స్-646 క్యాథే పసిఫిక్ విమానం ఇప్పటికీ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. గంటలు గడుస్తున్నా విమానం కదలకపోవడంతో... ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.