: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... భారత జట్టులో రెండు మార్పులు


ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టులో బ్రాడ్ స్థానంలో బాల్ జట్టులోకి వచ్చాడు. భారత జట్టులో షమీ స్థానంలో భువనేశ్వర్ కుమార్, గాయపడ్డ రహానే స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ, ముంబైలో ఆడుతుండటం ఆనందంగా ఉందని... ఈ వికెట్ పై తమకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపాడు. ఇండియన్ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, టాస్ ఓడిపోవడం పెద్ద సమస్య కాదని చెప్పాడు. గత మ్యాచ్ లలో ఆడిన విధంగానే ఈ మ్యాచ్ లో కూడా ఆడి, గెలుస్తామని చెప్పాడు. టీమిండియా తుది జట్టు: మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ, కేకే నాయర్, అశ్విన్, పార్థివ్ పటేల్, జడేజా, జయంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్. ఇంగ్లండ్ తుది జట్టు: కుక్, జెన్నింగ్స్, రూట్, మొయిన్ అలీ, స్టోక్స్, బెయిర్ స్టో, బట్లర్, వోక్స్, రషీద్, అండర్సన్, జేక్ బాల్.

  • Loading...

More Telugu News