: ఇరు జట్లను వేధిస్తున్న గాయాలు.. నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్
భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు మరికొద్ది సేపట్లో తెరలేవనుంది. 84 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఒకే ఒక్కసారి ఐదు సిరీస్‌ల ఘనతను సొంతం చేసుకున్న టీమిండియా మరోమారు ఆ రికార్డును అందుకోవాలని భావిస్తుండగా.. చావోరేవో తేల్చుకునేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాలుగో టెస్ట్ జరగనుంది. గత రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి జోరుమీదున్న టీమిండియా అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్ జోరుకు కళ్లెం వేయాలని ఇంగ్లిష్ జట్టు భావిస్తోంది. సిరీస్ గెలిచే చాన్స్ లేకపోవడంతో వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి డ్రా చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. కాగా ఇరు జట్లను గాయాల బెడద వేధిస్తోంది. రెండు జట్లలోని ప్రధాన ఆటగాళ్లు గాయాలబారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మైదానాల్లోని పిచ్‌లు భారత్‌కు అనుకూలించగా వాంఖడే కూడా స్పిన్‌కు అనుకూలమే. వర్ష సూచన లేకపోవడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.