: ఎంజీఆర్ వస్తుంటే ఆమె మాత్రం కుర్చీలో నుంచి లేచేది కాదట!
దివంగత సీఎం జయలలితకు సంబంధించి హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థి తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చరణ్య కణ్ణన్ అనే విద్యార్థి చేసిన ఈ పోస్ట్ లో జయలలిత కు సంబంధించిన అరుదైన విషయాలను ఉటంకించింది. ఆ విషయాల్లో ఒకటేమిటంటే.. సినిమా సెట్ కు ఎంజీఆర్ వస్తుంటే గౌరవ సూచకంగా అందరూ లేచి నిలబడే వారట. కానీ, పదహారేళ్ల జయలలిత మాత్రం తన చేతిలోని పుస్తకం చదువుకుంటూ అలాగే కూర్చునేదట. జయలలిత ధైర్యం చూసి అక్కడ ఉన్న వాళ్లందరూ ఆశ్చర్యపోతుండేవారట. నాడు జయలలిత చూపిన ధైర్యమే ఆమెను రాజకీయాల వైపు అడుగులు వేయించిందని చరణ్య కణ్ణన్ ఆ పోస్ట్ లో పేర్కొనడం గమనార్హం.