: పన్వెల్ లోయలో సికింద్రాబాద్ మహిళ మృతదేహం లభ్యం


మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా పన్వెల్ లోయలో సికింద్రాబాద్ కు చెందిన మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి పేరు రచిత కనోడియగా గుర్తించారు. గత నెల నవంబర్ 25న సికింద్రాబాద్ నుంచి ముంబయికు ఆమె వెళ్లారు. నవంబర్ 29వ తేదీన ఆమె తన తండ్రి, అత్తతో మాట్లాడారు. ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియకపోవడంపై నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ముంబయి విమానాశ్రయం నుంచి ట్యాక్సీలో రాయ్ గఢ్ జిల్లాలోని ప్రబల్గడ్ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించడం జరిగింది. ప్రబల్గడ్ లో పర్వతారోహణకు వెళ్లి ప్రమాదానికి గురై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రచిత మృతదేహాన్ని ఆమె బంధువులకు మహారాష్ట్ర పోలీసులు అప్పగించారు.

  • Loading...

More Telugu News