: టైమ్ మ్యాగజీన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా డొనాల్డ్ ట్రంప్


అమెరికా కొత్త అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఈ ఏడాది టైమ్ మ్యాగ్జిన్ ప‌ర్స‌న్ ఆఫ్ ద ఇయ‌ర్‌ పురస్కారం వరించింది. అమెరికాలో గత నెలలో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన రియ‌ల్ ఎస్టేట్ టైకూన్ ట్రంప్‌ ను టైమ్ మ్యాగ్జిన్ టైటిల్ వ‌రించడం విశేషం. ఈ పురస్కారానికి ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తదితరులు పోటీ పడ్డారు. వీరందర్నీ తోసిరాజని ట్రంప్ ఈ పురస్కారం గెలుచుకోవడం విశేషం. ట్రంప్ అధ్యక్షుడైన అనంతరం సాధించిన తొలి పురస్కారం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, ఈ పురస్కారం కోసం టైమ్ మ్యాగజీన్ నిర్వహించిన పోల్ లో హిల్లరీ ద్వితీయ స్థానంలో నిలిచినట్టు మేగజీన్ తెలిపింది. అమెరికా రాజకీయ సూత్రాల‌ను తిర‌గ‌రాసిన ట్రంప్ ఈ పురస్కారం గెలుచుకోవడం సముచితమేనని టైమ్ యాజమాన్యం అభిప్రాయ‌ప‌డింది. ప‌ర్స‌న్ ఆఫ్ ఇయ‌ర్ టైటిల్ తనకు లభించడం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ స‌త్కారాన్ని గొప్ప గౌర‌వంగా భావిస్తాన‌ని ట్రంప్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News