: మీడియాను సున్నితంగా హెచ్చరించిన సుష్మా స్వరాజ్ భర్త


కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు కిడ్నీ ఎవరు ఇస్తున్నారనే విషయమై మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిజోరాం మాజీ గవర్నర్, సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ మీడియాను సున్నితంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘సుష్మ శస్త్ర చికిత్స గురించి మీడియాలో సవివరంగా కథనాలు వస్తున్నాయి. కిడ్నీ మార్పిడి లైవ్ టెలికాస్ట్ కు మనం సిద్ధమవ్వాలేమో. ఒక భారత పౌరురాలు, ప్రజా సేవకురాలికి కొంత ఏకాంతం, గోప్యం అవసరం కదా!’ అని ఆ ట్వీట్ లో ఆయన అన్నారు. కాగా, సుష్మా స్వరాజ్ కు కిడ్నీ ఇచ్చే దాత ఆమెకు బంధువు కాడనే వార్తలు పలు వార్తా పత్రికలతో పాటు వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News