: లక్ష్మణరావు, భక్షి తరంజిత్ సింగ్ నివాసాల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్ పథకంలో భాగంగా ఆస్తులు వెల్లడించి, పన్నులు చెల్లించడంలో విఫలమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి బానాపురం లక్ష్మణరావు, బంగారం వ్యాపారి భక్షి తరంజిత్ సింగ్ నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయని ఆదాయపుపన్ను శాఖాధికారులు వెల్లడించారు. తన వద్ద 9,800 కోట్ల రూపాయలు ఉన్నాయని బానాపురం లక్ష్మణరావు ప్రకటించగా, తన వద్ద 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయని భక్షి తరంజిత్ సింగ్ ప్రకటించారు. ఈ నేఫథ్యంలో వారు తొలివిడత పన్ను చెల్లించడంలో విఫలం కావడంతో ఆదాయపుపన్ను శాఖాధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న దాడులు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం.

  • Loading...

More Telugu News