: ఇంగ్లండ్ సిరీస్ కు నిధులు విడుదల చేయండి: సుప్రీం ఆదేశం
బీసీసీఐ, జస్టిస్ లోథా కమిషన్ మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలతో నిధుల విడుదలను ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్బులు లేకుండా మ్యాచ్ ల నిర్వహణ అసాధ్యమని బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్ ల నిర్వహణకు 1.33 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు బ్యాంకులను ఆదేశించింది. ఇంగ్లండ్ తో సిరీస్ లో మిగిలి ఉన్న రెండు టెస్టు మ్యాచ్ ల నిర్వహణకు 1.33 కోట్ల రూపాయలు, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లకు ఒక్కో మ్యాచ్ నిర్వహణకు 25 లక్షల రూపాయలు చొప్పున నిధులు విడుదల చేయాలని బ్యాంకులను ఆదేశించింది. దీంతో ఇంగ్లండ్ సిరీస్ నిర్వహణకు నిధుల ఇబ్బందులు లేకుండా చూసింది.