: 'నేను నాన్నలా నాస్తికురాలిని కాదు' అంటున్న శ్రుతిహాసన్
తన తండ్రి కమలహాసన్ లా తాను నాస్తికురాలిని కాదని ప్రముఖ నటి శ్రుతిహాసన్ తెలిపింది. తన తండ్రికి, తనకు ప్రతి విషయంలోను పోలిక చూస్తారెందుకని ఆవేదన వ్యక్తం చేసిన శ్రుతి, తాను తన తండ్రిలా కాదని చెబుతోంది. ఆయనలా దేవుడ్ని పూర్తిగా వ్యతిరేకించనని, అలాగే గుడ్డిగా కూడా నమ్మనని తెలిపింది. గుళ్లకు వెళ్లడం, దేవుడ్ని నమ్మడం, ప్రత్యేక పూజలు నిర్వహిచడం వంటివి చేస్తానని పేర్కొంది. అలాగే చిన్న చిన్న కోరికలు కోరుకుంటానే కానీ, అన్నీ ఆయనే తీరుస్తాడని మాత్రం నమ్మనని తెలిపింది.