: కీలక వడ్డీరేట్లు యథాతథం: ఆర్‌బీఐ
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత తొలిసారి సమావేశం నిర్వహించిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని పేర్కొంది. రెపోరేటు 6.25గానే ఉంటుందని పేర్కొంది. రివర్స్ రెపోరేటు కూడా 5.75 శాతంగానే ఉంటుందని చెప్పింది. నాలుగో త్రైమాసికం నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనాను 7.6 నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ఈ సమావేశంలో ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ పాల్గొంది.