: పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోం: స‌్పష్టం చేసిన ప్రధాని మోదీ
ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ తమ ఎంపీలకు పలు సూచనలు చేశారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తోన్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. అలాగే డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పెద్దనోట్ల రద్దును వెనక్కి తీసుకునే వీలు లేదని తేల్చిచెప్పారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజలకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకి కూడా ఉందని అన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చేస్తోన్న అసత్యప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. సభలో విపక్షాలకు దీటుగా బదులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చర్చకు సిద్ధమంటూనే సభను జరగకుండా విపక్ష నేతలు అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.