: శశి థరూర్ అధికారిక నివాసంలో విగ్రహాలు, పురాతన వస్తువుల చోరీ


కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అధికారిక బంగళాలో చోరీ జరిగింది. ఇంట్లో చొరబడిన దొంగలు ఆరు విగ్రహాలు, ఒక పురాతన వస్తువు, రాగి కళ్లజోడును దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం, ఈ చోరీ నవంబర్ 29 రాత్రి జరిగింది. లోధీ రోడ్ లోని ఎంపీ నివాస సముదాయంలో పని చేసే ఓ ఉద్యోగి... బంగళా తాళాలను పగలగొట్టినట్టు మరుసటి రోజు ఉదయం గమనించాడు. ఈ ప్రాంతంలో వీధుల్లో తిరిగేవాళ్లు ఎక్కువగా ఉంటారని... వారిలో ఎవరైనా ప్రహరీ గోడ ఎక్కి, లోపలకు ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, గతంలో విగ్రహాలను చోరీ చేసిన ఓ గ్యాంగ్ హస్తం ఈ చోరీలో ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ తెలిపారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

  • Loading...

More Telugu News