: రైల్లో బ్యాగు స్వాధీనం చేసుకున్న అధికారులు.. అందులో 35 లక్షల విలువైన రూ.500 నోట్లు
పెద్దనోట్ల రద్దు అనంతరం తనిఖీలు చేస్తోన్న పోలీసులకి భారీగా రద్దయిన నోట్లు పట్టుబడుతున్నాయి. నోట్లను అక్రమంగా మార్చుకోవడానికి నల్లకుబేరులు వాటిని పలు మార్గాల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు బీహార్ లోని గయలో శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ఓ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్న రైల్వే కస్టమ్స్ అధికారులు అందులో 35 లక్షల విలువైన రద్దయిన రూ.500 నోట్లను గుర్తించారు. ఈ అంశంపై అధికారులు మాట్లాడుతూ.. సాధారణ తనిఖీల్లో భాగంగా తాము చేస్తోన్న సోదాల్లోనే ఈ బ్యాగును గుర్తించామని, అది ఎవరికి చెందిన బ్యాగో తెలియదని చెప్పారు. అంతేగాక తాము స్వాధీనం చేసుకున్న మరో మూడు బ్యాగుల్లో 14 మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయని తెలిపారు.