: ఈ ఏడాది ట్విట్టర్‌లో అత్యధికంగా ఆసక్తిరేపిన టాప్-10 విషయాలు ఇవిగో!


సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్లో ప్ర‌స్తుత‌ ట్రెండ్ కు త‌గ్గ‌ట్లు యాష్ ట్యాగ్ తో పోస్టులు చేస్తూ ఖాతాదారులు త‌మ అభిప్రాయాలు తెలుపుతారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది త‌మ వెబ్‌సైట్‌లో మోస్ట్‌ పాప్యులర్ అయిన‌ అంశాల జాబితాను ట్విట్టర్ తెలిపింది. వాటిల్లో అన్నింటిక‌న్న #Rio2016 పై అభిమానులు అత్య‌ధికంగా ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. #Rio2016 పై చేసిన పోస్టులే అగ్ర‌ స్థానంలో నిలిచాయి. ఇక అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన #election2016 రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆ త‌రువాతి స్థానాల్లో వ‌ర‌స‌గా ఆన్‌లైన్‌ గేమింగ్ #PokemonGo, #Euro2016, #oscars, #Brexit, #Trump ఈ జాబితాలో నిలిచాయి. వీటిల్లో గ‌మ‌నించాల్సి అంశం ఏంటంటే సంస్థ‌ల‌కు కాకుండా ఒకే ఒక వ్యక్తికి సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్ ల‌లో డొనాల్డ్‌ ట్రంప్ మాత్ర‌మే టాప్ 10లో ఉన్నారు.

  • Loading...

More Telugu News