: అభిమానులను కలవర పెడుతున్న పవన్ కల్యాణ్ విగ్రహం
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ విగ్రహాన్ని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ సెంటర్ లో ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విగ్రహం ఇంతవరకు ఆవిష్కరణకు నోచుకోలేదు. ఇలా విగ్రహాలు పెట్టించుకోవడం తనకు ఇష్టం లేదని పవన్ కల్యాణ్ తన అభిమానులకు గతంలో చెప్పడంతో... తమ అభిమాన హీరోకు నచ్చని పని చేయడమెందుకని... ఆ విగ్రహాన్ని అలాగే వదిలేశారు. కానీ, తాజాగా ఆ విగ్రహానికి కప్పిన కవర్ కూడా చిరిగిపోయి సగం విగ్రహం బయటకు కనిపిస్తోంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతోంది. దీంతో, ఆయన అభిమానులు కలవరపడుతున్నారు. విగ్రహం ప్రతిష్టకు నోచుకోకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. మరి, తాజా పరిణామాల పట్ల జనసేనాని స్పందిస్తారో? లేదో? వేచి చూడాలి.