: నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళుతున్న పీఎస్ఎల్‌వీ సీ-36


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పీఎస్ఎల్‌వీ సీ-36 నింగిలోకి దూసుకెళుతోంది. ఈ ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ రాకెట్ రిసోర్స్‌శాట్‌-2 ఏ ను నింగిలోకి మోసుకెళుతోంది. రిసోర్స్‌శాట్‌-2ఏ జ‌ల‌వ‌న‌రులు, ప‌ట్ట‌ణ‌ప్ర‌ణాళిక, వ్య‌వ‌సాయ‌, ర‌క్ష‌ణ రంగాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ప్ర‌యోగం విజ‌య‌వంత‌మ‌యితే ఐదేళ్ల‌పాటు రిసోర్స్‌శాట్‌-2ఏ సేవ‌ల‌ను అందిస్తుంది. రిసోర్స్‌శాట్‌-2 బ‌రువు 1235 కిలోలు.

  • Loading...

More Telugu News