: శ్రీశైల మల్లనకు ఓ ప్రత్యేక టీవీ చానల్
తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి టీటీడీ చానల్ ఉన్నట్టుగానే, శ్రీశైల మల్లన్న కోసం ఓ ప్రత్యేక టీవీ చానల్ ఏర్పాటు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. ఇందుకోసం స్టూడియో సైతం తయారవుతోందని, ఇంకో ఆరు నెలల్లో చానల్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలిదశలో రోజుకు 12 గంటల ప్రసారాలు ఉంటాయని తెలిపారు. శ్రీశైలం గుడి చుట్టూ మాడ వీధులను 90 అడుగుల వెడల్పున నిర్మించనున్నామని తెలిపారు. టీటీడీ చానల్ తమిళ వర్షన్ మొదలైందని, త్వరలోనే హిందీ, ఇంగ్లీష్ చానళ్లు ప్రారంభమవుతాయని మాణిక్యాలరావు వెల్లడించారు.