: అన్నాడీఎంకే భవితవ్యంపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత మృతి తర్వాత పార్టీ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో ఆధిపత్యపోరు మొదలయ్యే తరుణం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. పార్టీ పగ్గాలను జయలలిత నెచ్చెలి శశికళ తీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని అన్నారు. ‘అమ్మ’కు ఎంతో ఆప్తుడైన పన్నీర్ సెల్వం ఎంతోకాలం ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేదని వివరించారు. ముఖ్యమంత్రి పదవిని శశికళ చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమవుతాయన్నారు. పార్టీలో విభేదాలు రచ్చకెక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు.