: నాలుగో టెస్టులో పార్థివ్ కు మరోఛాన్స్


టీమిండియా టెస్టు జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ పార్థివ్ పటేల్ కు మరోఛాన్స్ వచ్చింది. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత జట్టులో స్థానం సంపాదించుకున్న పార్థివ్ పటేల్ మూడో టెస్టులో 42, 67 పరుగులతో రాణించి, విజయానికి బాటలు వేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ సాహా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఆయన గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని, ప్రస్తుతానికి సాహాకి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్యులు తెలిపారు. దీంతో పార్థివ్ ను నాలుగో టెస్టుకు ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబై వేదికగా ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ లో పార్థివ్ పటేల్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా రాణిస్తే, పార్థివ్ జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News