: బ్యాంక్‌లో పుట్టిన ఆ చిన్నారికి ‘క్యాషియర్’ అనే పేరు పెట్టేశారు!
ఈ నెల 2వ తేదీన ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఓ గర్భిణికి నొప్పులు రావడంతో ఆమెకు బ్యాంకులోనే కాన్పు చేసిన సంగతి తెలిసిందే. ఆమె బ్యాంకులోనే పండంటి బాబుకి జన్మనిచ్చింది. దాంతో ఆ బాబుకి ‘క్యాషియర్’ అనే అర్థం వచ్చే ‘ఖజాంచి నాథ్’ అని పేరుపెట్టారు. ఖజాంచి అనే పదం ఖజానా నుంచి పుట్టింది. ఆ పసివాడి తల్లిపేరు సర్వేషా దేవి. ఆమె భర్త రెండు నెలల క్రితం ఓ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ కుటుంబానికి సర్కారు పరిహారాన్ని అందించింది. ఆ డబ్బును తీసుకోవడానికే సర్వేషా దేవి అక్కడకు వచ్చింది. ఆమెకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన ఈ ‘క్యాషియర్’ ఐదోవాడు. ఆమె బిడ్డకు జన్మనిచ్చిందని తెలుసుకున్న ఆమె సోదరుడు అనిల్ వెంటనే అక్కడకు చేరుకొని అక్కడే ‘ఖజాంచి నాథ్’ అనే ఈ పేరుపెట్టాడు.