: అంతిమ యాత్ర ప్రారంభం...!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంతిమ యాత్ర ప్రారంభమైంది. రాజాజీ హాల్ లో ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం ఉంచిన ఆమె పార్థివదేహాన్ని త్రివిధ దళాధికారులు కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో జాతీయ జెండాను కప్పి భుజాలపై మోసుకుంటూ వాహనంపైకి ఎక్కించారు. ఈ సందర్భంగా ఎవరినీ ఆమె దేహం దగ్గరకు రానివ్వలేదు. పూలతో అలంకరించిన వాహనంపై ఆమె పార్థివదేహాన్ని ఉంచారు. వాహనంలోకి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళను మాత్రమే అనుమతించారు. సైనికాధికారులే సర్వం అయి అంత్యక్రియల తుదిఘట్టం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలే వారసులైన వేళ త్రివిధ దళాధికారులు ఆమెకు అన్ని లాంచనాలు నిర్వహించడం విశేషం.