: జయలలిత డెత్ సర్టిఫికెట్ జారీ... మీరూ చూడండి!
తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, నిన్న రాత్రి 11:30 గంటలకు తుది శ్వాస విడిచిన జయలలిత పేరిట డెత్ సర్టిఫికెట్ ను గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లోని పబ్లిక్ హెల్త్ విభాగం విడుదల చేసింది. 68 సంవత్సరాల జే జయలలిత, చెన్నై, గ్రీమ్స్ లేన్ లోని అపోలో హాస్పిటల్స్ లో మరణించారని, తల్లి పేరు జె సంధ్య, తండ్రి పేరు ఆర్ జయరాం అని, నంబర్ 81, వేద నిలయం, పోయిస్ గార్డెన్, చెన్నై - 600086 చిరునామాతో ఈ ధ్రువపత్రం జారీ అయింది. జయ మరణ రిజిస్ట్రేషన్ నంబర్ 2016/09/111/000647/0గా పేర్కొనగా, సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ఏ సేతునాథన్ సంతకం చేశారు. ఆ డెత్ సర్టిఫికెట్ ను మీరూ చూడవచ్చు.