: జయ పార్థివదేహానికి నమస్కరించి, నివాళులు అర్పించిన స్టాలిన్
చెన్నైలోని రాజాజీ హాలులో ప్రజాసందర్శనార్థం ఉంచిన జయలలిత పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు విపక్షనేత ఎంకే స్టాలిన్ రాజాజీ హాలుకు వచ్చి జయ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి, నమస్కరించి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్రానికి ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. చేపట్టిన ప్రతి పదవినీ ఆమె చాలా సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఆమె మరణం రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. మరోవైపు, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా జయలలితకు నివాళి అర్పించారు.