: జయలలిత పేరులో 'జయ' అంటే ఏమిటి 'లలిత' అంటే ఏమిటి?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆ పేరు పెట్టడం వెనుక చిన్న ఆసక్తికర కథ ఉంది. ఆమె అసలు పేరు కోమలవల్లి. ఆ పేరు ఆమె అవ్వది. బ్రాహ్మణ ఆచారాల ప్రకారం రెండు పేర్లు పెట్టుకునే సంప్రదాయం ఉండేది. దీంతో ఆమెకు ఒక్క ఏడాది వయసు వచ్చిన తర్వాత జయలలిత అనే పేరును పెట్టారు. ఇదే పేరుతోనే ఆమెను స్కూల్లో చేర్చారు. జయలలిత పేరులోని జయ, లలిత అనే రెండు పదాలు రెండు నివాసాలకు సూచిక. మైసూరులో తన తల్లి వేదవల్లి, తండ్రి జయరాంలతో కలసి జయలలిత... జయ విలాస్ లో కొంతకాలం, లలితా విలాస్ లో మరికొంత కాలం నివసించారు. ఈ నివాసాలకు గుర్తుగానే జయ, లలిత అనే పదాలను తీసుకుని... జయలలితగా పేరును పెట్టారు.