: రాజకీయాల్లో జయలలితది ఓ ఘన చరిత్ర: కేసీఆర్


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జయలలిత ఓ విప్లవ నాయకురాలని... ఆమె మరణం తమిళనాడుకు, తమిళ ప్రజలకు తీరని లోటు అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయాల్లో వరుసగా రెండోసారి ఎన్నికై, ప్రభుత్వాన్ని కొనసాగించడం మామాలు విషయం కాదని... అలాంటి ఘనత జయలలితకు సొంతమైందని కొనియాడారు. తమిళ రాజకీయాల్లో జయలలితది ఓ ఘన చరిత్ర అని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News