: జయ వారసుడిగా అజిత్?... తెరపైకి వచ్చిన చర్చ!


తమిళనాడు ముఖ్యమంత్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో ఆమె వారసుడిపై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. పార్టీ నేతలు సీనియర్ నేత పన్నీర్ సెల్వమ్ ను మళ్లీ సీఎంగా ఎన్నుకున్నారంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు డీఎంకేను ఢీ కొట్టే సామర్థ్యం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అజిత్ పేరు మరోసారి చర్చకు వచ్చింది. అజిత్ అయితే డీఎంకేను ఢీ కొట్టగలడని, అంతే కాకుండా జయలలిత అజిత్ ను కుమారుడిగా భావించేదని ఏఐఏడీఎంకే సమావేశంలో ఓ వర్గం పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం అయితేనే బాగుంటుందని, అజిత్ అయితే మాస్ లో ఫాలోయింగ్ పెరుగుతుంది కానీ, పార్టీ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు అనుకూలంగా సంతకాలు పెట్టినట్టు, అనంతరం అజిత్ ను ఏఐఏడీఎంకే పగ్గాలు చేపట్టే విధంగా ఒప్పించి, పార్టీని నిలబెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై మరింత స్పష్టత రావలసివుంది.

  • Loading...

More Telugu News