: చికిత్సకు స్పందిస్తున్న జయలలిత!
తమిళనాడు సీఎం జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఆమెకు చికిత్స అందిస్తున్న న్యూరాలజిస్టులు ఈ విషయాన్ని చెప్పినట్లు ఒక న్యూస్ ఛానెల్ లో పేర్కొన్నారు. లైఫ్ సపోర్టింగ్, ఈసీఎంవో ద్వారా జయలలితకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు పేర్కొన్నారు. మరికొద్ది సేపట్లో జయలలిత ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు సమీక్షించనున్నట్లు సమాచారం.