: అపచారం... తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగిరిన మరో విమానం
తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు ప్రయాణించడం అరిష్టమంటూ ఆగమ పండితులు చెబుతున్నా... విమానయాన శాఖ మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు. తిరుమలను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలంటూ ఎప్పట్నుంచో డిమాండ్లు ఉన్నప్పటికీ... అలా ప్రకటించడం కుదరదంటూ విమానయాన శాఖ గతంలోనే స్ఫష్టం చేసింది. ఈ నేపథ్యంలో, తాజాగా ఈరోజు మరో విమానం శ్రీవారి ఆలయంపై నుంచి ఎగిరింది. ఈ ఘటన భక్తులను, టీటీడీ కమిటీ సభ్యులను, అర్చకులను ఎంతో కలచివేసింది.