: వార్తా చానళ్లలో ప్రసారమైన వార్తల్ని ఖండించిన అపోలో


తమిళనాడు రాజధాని చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 'గౌరవనీయురాలైన ముఖ్యమంత్రికి వైద్య చికిత్స జరుగుతోంది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్ సాయంతో ఆమెకు వైద్యం అందిస్తున్నాము. ఎయిమ్స్ కు చెందిన 8 మంది నిపుణులు, అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యనిపుణులు, విదేశీ వైద్యనిపుణుల సమక్షంలో వైద్యం జరుగుతోంది. ఆమె ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వైద్యం జరుగుతోంది. టీవీ ఛానెళ్లలో వస్తున్న విధంగా ఎలాంటి విషాదం చోటుచేసుకోలేదు. ఆందోళన చెందవద్దు' అంటూ అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

  • Loading...

More Telugu News