: తమిళనాడులో అవాంఛనీయ ఘటనలు తలెత్తితే... వెంటనే స్పందిస్తాం: కేంద్ర ప్రభుత్వం


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో... తమిళనాడు వ్యాప్తంగా ఉద్విగ్నభరిత వాతారణం నెలకొంది. జరగకూడనిది ఏదైనా జరిగితే... రాష్ట్ర వ్యాప్తంగా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, చెన్నైలోని పరిస్థితులను కేంద్ర హోంశాఖ చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తోంది. అలజడులు చెలరేగితే వెంటనే స్పందిస్తామని... ఎన్ని అవసరమైతే అన్ని కేంద్ర బలగాలను పంపిస్తామని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే, తమిళనాడు ఇంతవరకు తమను అధికారికంగా ఎలాంటి సహాయం కోరలేదని చెప్పారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని అన్నారు. సరిపడా కేంద్ర బలగాలు ఇప్పటికే తమిళనాడులో ఉన్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News