: పారామిలటరీ బలగాలను పంపాలని కోరిన తమిళనాడు ప్రభుత్వం


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉందని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వెంటనే తమ రాష్ట్రానికి అదనపు పారామిలటరీ బలగాలను పంపాలని కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. దీంతో తమిళనాడు పంపేందుకు కేంద్రం 9 కంపెనీల పారామిలటరీ బలగాలను సిద్ధం చేసింది. వీటికి తోడు తమిళనాట లీవులో ఉన్న పోలీసుల సెలవులను రద్దు చేసి విధుల్లో చేరాలని ఆదేశించింది. దీనికి తోడు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఎప్పుడు తెరిచేది తిరిగి ప్రకటిస్తామని తెలిపింది. అలాగే, అపోలో ఆసుపత్రి నుంచి పోయెస్ గార్డెన్ వరకు రోడ్డును బ్లాక్ చేసింది. సాయంత్రం 6 గంటలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా సమావేశం కానున్నారు. దీంతో తమిళుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

  • Loading...

More Telugu News