: సీన్ రివ‌ర్స్‌... క్యూలో నిల‌బ‌డ్డ మ‌హిళ‌ల‌పై చేయిచేసుకున్న‌ బ్యాంకు మేనేజ‌ర్‌


పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌రువాత‌ నగదు కోసం బ్యాంకుకు వస్తోన్న ఖాతాదారులు ప‌లుచోట్ల‌ డ‌బ్బు దొర‌క్క తీవ్ర అస‌హ‌నంతో బ్యాంకు సిబ్బందిపై దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, సిరిసిల్ల రాజన్న జిల్లా ముస్తాబాద్‌లో ఖాతాదారులపైనే ఓ బ్యాంక్ మేనేజర్ దాడి చేశాడు. స్థానిక ఆంధ్రాబ్యాంక్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బారులు తీరిన ఖాతాదారులు గంద‌ర‌గోళం సృష్టిస్తుండ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర.. లైన్లో ఉన్న మ‌హిళ‌ల‌పై చేయి చేసుకొని రెచ్చిపోయాడు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. రాజేంద్ర ప్ర‌వ‌ర్త‌న‌కు నిరసనగా స్థానికులు బ్యాంకు వ‌ద్దే ఆందోళ‌న చేస్తున్నారు.

  • Loading...

More Telugu News