: మోదీ బంగారం లెక్కల్లో ఫుల్ బిజీగా వున్నారు!: రేణుకా చౌదరి విసుర్లు


ప్రధాని నరేంద్ర మోదీ బంగారం లెక్కల్లో ఫుల్ బిజీగా ఉండడం వల్లే పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, వివాహితులకు ఎంత బంగారం ఉండాలి? అవివాహితులకు ఎంత బంగారం ఉండాలి? అన్న లెక్కల్లో మోదీ ఫుల్ బిజీగా ఉంటున్నారని, అందుకే పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారని అన్నారు. ఒకే ఒక్క నిర్ణయంతో దేశ పౌరుల చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా చేసిన మోదీని మించిన 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' ఇంకెవరుంటారని ఆమె ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News