: జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగానే వుంది!: లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బేలె
చెన్నయ్ అపోలో ఆసుపత్రి వైద్యుల విజ్ఞప్తి మేరకు లండన్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం సదరు ఆసుపత్రికి వచ్చిన వైద్య నిపుణుడు రిచర్డ్ బేలె జయలలిత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఓ ప్రకటన చేశారు. జయలలిత ఆరోగ్యం చాలా విషమంగా ఉందని ఆయన చెప్పారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని ప్రస్తుతం మిగతా వైద్యులతో కలిసి తాను కూడా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అధునాతన వైద్య పరికరాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోందని చెప్పారు. అపోలో వైద్యులతో పాటు ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకు చికిత్స అందిస్తున్నారని ప్రకటన చేశారు.