: ముందు జాగ్రత్త! తమిళనాడుకు బస్సు సర్వీసులు నిలిపివేసిన కర్ణాటక
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమించిందన్న అపోలో ఆస్పత్రి వైద్యుల ప్రకటనతో పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమైంది. ఉప్పు, నిప్పులా ఉన్న ఇరు రాష్ట్రాల సంబంధాల నేపథ్యంలో తమిళనాడుకు వెళ్లే అన్ని బస్సు సర్వీసులను నిలిపివేసింది. ఇప్పటికే తమిళనాడు ఉద్రిక్తంగా ఉంది. ఈ సమయంలో రాకూడని ప్రకటన వస్తే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు బస్సు సర్వీసులను రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల కావేరీ జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల్లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే.